నేటి సాక్షి, రాయికల్ :
రాయికల్ పట్టణ కేంద్రంలోని హరిదాసు కిరాణం సమీపంలో రోడ్డుపై ఒక కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా, అది అక్కడికక్కడే మృతి చెందింది.తల్లి కుక్క తన మృత పిల్ల పక్కన దీనంగా కూర్చుని ఉండడం,ఎవరిని తన దగ్గరికి రానీయకుండా ఉండడం చూసి చాలామంది మాతృ ప్రేమను చాటుకున్న శునకాన్ని చూసి, అందరూ ఆశ్చర్యపడ్డారు.ఈ సంఘటన తల్లి ప్రేమకు జంతువులు కూడా అతీతం కాదని,వారి మాతృస్నేహం మనసులను హత్తుకుంటుందని సూచిస్తున్నాయి





