- జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 319 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 166 కోట్ల 24 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రతిపాదించిన 326 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 319 కొనుగోలు కేంద్రాల ద్వారా 100018.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 41132.360 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉందని, సంబంధిత 12,127 మంది రైతుల ఖాతాలలో 166 కోట్ల 24 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 29 రైస్ మిల్లులకు సిఎంఆర్ అనుమతులు జారీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని 314 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి చేసి, మూసి వేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు 99 శాతం పూర్తికావచ్చిందన్నారు. రైతులు సంక్రాంతి పండుగ సందర్భంగా బోనస్ తో సంబరాలు జరుపుకోనున్నారని తెలిపారు.





