- గన్నేరువరం రజక సంఘం ఆద్వర్యంలో చిట్టిబాబు దిష్టి బొమ్మ దహనం

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్) : 24/7 టీవీ డిబేట్లో రజకులను హేళన చేసే విధంగా చులకన భావంతో మాట్లాడిన సినీ రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు దిష్టిబొమ్మను గన్నేరువరం మండల రజక సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకులను కించపరిచేలా టీవీ డిబేట్లో మాట్లాడిన చిట్టిబాబును వెంటనే అరెస్టు చేయాలని రజక జాతికి చిట్టిబాబు వెంటనే భహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే 24/7 న్యూస్ చానెల్ కూడా దీనికి భాద్యత వహించి వారి చానెల్లో చిట్టి బాబుతో క్షమాపణలు చెప్పించాలని లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం గన్నేరువరం పోలీస్ స్టేషన్లో చిట్టిబాబుపై ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునిగంటి నాగరాజు, గౌరవ అధ్యక్షులు మునిగంటి మొండయ్య, ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సంపత్, గ్రామ శాఖ అధ్యక్షులు మునిగంటి మల్లయ్య, ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య, మునిగంటి తిరుపతి, ప్రధాన కార్యదర్శి రాములు, కోశాధికారులు శ్రీధర్,మునగంటి లింగయ్య కనుకయ్య, తదితరులు పాల్గొన్నారు.





