Wednesday, March 11, 2026

యువతను క్రీడల్లో ప్రోత్సహించాలి

  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- గ్రామీణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలానే ఉద్దేశ్యంతోనే ప్రతి ఏడాది కబడ్డీ, క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని బిజెపి జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకోని రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ ను శనివారం లక్షేట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3వ వివేకానంద కప్ కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, అనంతరం క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని యువతను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మరిన్ని క్రీడా పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. క్రీడలతో పాటు యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ అందించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి లక్షేట్టిపేట్ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరి గోపాల్, మండల అధ్యక్షులు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, నాయకులు గడ్డం స్వామిరెడ్డి, ఎనగందుల కృష్ణమూర్తి, గుండా ప్రభాకర్, మాధవరపు వెంకట రామన్ రావు, గాదె శ్రీనివాస్, మోటపలుకుల గురవయ్య, రమేష్ జైన్, బొప్పు కిషన్, కనుగంటి మల్లయ్య, నరేష్ జైన్, తగరపు గంగన్న, సిద్ధార్థ, సమరసింహా, వెంకటేష్, వెంకటరామణ, తులసి, పాంచాల రమేష్ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News