
- కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగాను
- సిరిసిల్ల జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరుకు
- కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్
- దివ్యాంగులకు ప్రభుత్వ సహాయంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ప్రజల అభ్యున్నతి కోసం చేసా రాజకీయాల కతీతంగా నాయకులంతా కలిసి పని చేయాలని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాన కొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్య నారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కబ్జా చేసిన పేద ప్రజల భూములను తిరిగి ఇయ్యాలి..
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్
దివ్యాంగులు మనోధైర్యం తో నిత్య జీవితం కొనసాగిస్తారని, దివ్యాంగులకు అండగా ఉండటం మనందరి బాధ్యతని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69 లక్షల 54 వేలు విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో వేములవాడ కేంద్రంగా 2 కోట్ల 50 లక్షల విలువ చేసే పరికరాలను 1930 మంది దివ్యాంగ సోదరి సోదరీమణులకు అందించామని అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయాల కతీతంగా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పని చేస్తున్నామని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల తర్వాత అందరం ప్రజల కోసం నిజాయితీగా పని చేయాలని అన్నారు. కబ్జా చేసిన పేద ప్రజల భూములను అధికారులు వెంటనే మణస్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కలెక్టర్ కు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రసాద్ స్కీం కింద వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం నమూనాలు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే ఎదురు మంజూరయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. కార్పొరేటర్ స్థాయి నుంచి తాను నేడు కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగానని, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి పరిధిలో అభివృద్ధికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామన్నారు. ధరణి ద్వారా జరిగిన అవక తవకలను సరి చేయాలని కేంద్ర మంత్రి కోరారు.జిల్లాలో దివ్యాంగులకు ఉపాధి కల్పన కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి 18 వేల వరకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కేంద్ర మంత్రి ప్రశంసించారు. రాబోయే రోజులలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వ సహాయంతో పెట్రోల్ బంక్
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు కరీంనగర్ జిల్లాలో గొప్ప స్థాయికి ఎదగడం తన వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 9 వేలకు పైగా దివ్యాంగులకు ఫించన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక చోరువతో దివ్యాంగులకు ప్రభుత్వ స్థలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వాహనాల పెట్రోల్ ఇక్కడ నుంచే తీసుకునే విధంగా, దీని ద్వారా దివ్యాంగులకు ప్రత్యేకంగా ఆదాయం లభించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. నేడు జిల్లాలో 322 మంది దివ్యాంగులకు 674 ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో మరోసారి క్యాంప్ నిర్వహించే పెండింగ్ ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని, అదేవిధంగా కొంతమంది దివ్యాంగులకు ప్రత్యేకంగా జైపూర్ నుంచి కాలు తయారుచేసి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. 2024-25 సంవత్సరంలో వేములవాడ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని, ఆలయ అభివృద్ధిలో కేంద్రమంత్రి సహకారం అందించాలని, వేములవాడలో రోడ్డు వెడల్పు పనులకు 47 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశామని, అన్నదాన సత్రానికి 35 కోట్లు మంజూరు చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేయాలని ప్రభుత్వ విప్ కోరారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలతో చర్చించి వేములవాడ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను సీ.ఎస్.ఆర్ కింద అభివృద్ధి చేయాలని అన్నారు. పిల్లలకు ఐఐటి, నీట్ శిక్షణ ఇట్టి ఇచ్చేందుకు సహకారం అందజేయాలని, సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరుకు కృషి చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.





