Tuesday, March 10, 2026

కోరుట్ల తహశీల్దార్ ఇట్యాల కిషన్ ను పరామర్శించిన డాక్టర్ పేట భాస్కర్

నేటిసాక్షి, కోరుట్ల:
కోరుట్ల తహశీల్దార్, రచయిత ఇట్యాల కిషన్ తండ్రి ఇట్యాల వెంకటయ్య ఈమద్యనే మృతి చెందగా ఆదివారం తన స్వంత గ్రామమైన ఓదెల మండలం కనగర్తిలో జరిగిన శ్రద్దాంజలి కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, స్థానిక సిపిఐ నాయకులతో కలిసి పాల్గొని పరామర్శించారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ మృతి చెందిన ఇట్యాల వెంకటయ్య రైతు సంఘం నేతగా కనగర్తి ప్రాంతంలో సుపరిచితుడని తండ్రి ఆశయాలు పునుకుపుచ్చుకొని ఎదిగిన తహశీల్దార్ ఇట్యాల కిషన్ రచయితగా రచించిన ‘ధరణి కథలు’ లను ఈసందర్భంగా ఆవిష్కరించడం అభినందనీయమని పేట భాస్కర్ కొనియాడారు. ఈకార్యక్రమంలో సిపిఐ దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపెల్లి లక్ష్మణ్, సిపిఐ నాయకులు చెన్న విశ్వనాథం, సుతారి రాములు, రామిల్ల రాంబాబు, సాంబారి మహేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News