నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్):
యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు అని వివేకానంద యూత్ సభ్యులు అన్నారు. మండల కేంద్రంలోని వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 162వ జయంతి సందర్బంగా జాతీయ యువజన దినోత్సవంను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ… వివేకానందుడు మహోన్నతమైన ఆధ్యాత్మిక నాయకుడిగా, తత్వవేత్తగా హిందూ మతం యొక్క పునరుజ్జీవనం, పాశ్చాత్య దేశాలలో వేదాంత తత్వశాస్త్రం యొక్క వ్యాప్తిలో కీలక పాత్ర పోషించారన్నారు. కుల, మత, జాతి, లింగ వివక్ష లేకుండా అందరిని సమాన దృష్టితో చూడడంతో ఆదర్శంగా నిలిచాడన్నారు. ఆయన బ్రతికింది 39 సంవత్సరాలే అయిన 1000 సంవత్సరాలకు చెరిగిపోని ముద్ర వేశాడు అని, ఆయన సేవలను కొనియాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, కేరటాలను యువకులకు ఆదర్శంగా చూపి అవి పడిపోతున్నదుకు కాదు పడినా లేస్తునందుకు అని స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు నగేష్, సభ్యులు తిరుపతి, రవి, సుధీర్, రాజేందర్, ప్రశాంత్, కిట్టు, కిరణ్, రవి, సంతోష్, రాజేశం, చందు, సతీష్ కుమార్ యువకులు తదితరులు పాల్గొన్నారు.





