- పద్మశాలి భవనంలో వివేకానంద చరిత్ర, మైథాలజీ వివిధ అంశాల యందు క్విజ్ పోటీలు
- అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు
- ఎస్ఐ శ్రీకాంత్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం
నేటిసాక్షి, కోరుట్ల:
స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కోరుట్ల పద్మశాలి సంక్షేమ సంఘం పద్మశాలి యువత ఆధ్వర్యములో పద్మశాలి భవనంలో వివేకానంద చరిత్ర, మైథాలజీ అలాగే వివిధ అంశాల యందు క్విజ్ పోటీలు నిర్వహించగా వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతిని కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని, కోరుట్ల పబ్లిక్ స్కూల్ కరెస్పాండంట్ గుజ్జేటి వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమములో కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేస్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్, అలాగే పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొని విద్యార్థులను అభినదిచడం జరిగింది.





