Tuesday, March 10, 2026

జనంలోకి వన్యప్రాణులు..!

  • నక్క దాడిలో ఓ మహిళ కు తీవ్ర గాయాలు..
  • మరో ఇద్దరికి స్వల్ప గాయాలు..
  • క్షతగాత్రులను పరామర్శించిన నియోజకవర్గ ఇంచార్జ్ కేకే

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులపై నక్క దాడి చేసింది. అడవిలో ఉండవలసిన క్రూర జంతువైన నక్క అనుకోకుండా ఆహారం వెతుక్కుంటూ గ్రామంలోకి ప్రవేశించింది, జనార్యంలోకి రావడంతో మద్దికుంట గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయాన్నే ఇంటి ముందు పనులు చేస్తున్న సూత్రం రాధా(34) అనే మహిళ పై నక్క దాడి చేయగా మహిళా తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొలం పనులకు వెళ్తున్న డిటి సత్తయ్య(40) తెర్లుమద్ది కిషన్ (32) నక్క దాడి చేయడంతో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులపై దాడి చేసిన నక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులను జంతువుల నుంచి రక్షణ కల్పించాలంటూ గ్రామస్థులు వేడుకున్నారు. రాధమ్మ పరిస్థితి విషమంగా మారింది. అనంతరం సిరిసిల్ల లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారికి తక్షణ వైద్య చికిత్సలు అందే విధంగా చూడాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News