Tuesday, March 10, 2026

గోదాదేవి రంగనాయకుల కళ్యాణంలో కృష్ణారావు

నేటిసాక్షి, కోరుట్ల:
కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామిఆ లయంలో, బండలింగాపూర్ ఆలయాల్లో ధనుర్మాసం ఉత్సవాలను పురస్కరించుకొని గోదాదేవి రంగనాయకుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం సస్యశ్యామలంగా పాడి, పంటలతో తులతూగాలని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావుతో పాటు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, కోరుట్ల మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు పుప్పాల ప్రభాకర్, వెలుముల శ్రీనివాసరావు, రామానుజమ్, శేఖర్, జంగా గంగ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News