Tuesday, March 10, 2026

రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు…

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి:
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం నడిబొడ్డున ఉదయం సమయంలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీ అయిన సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని నయనగర్ లో నల్లమోతు రామా భర్త దుర్గారావు ఆరుబయట గోరింటాకు కొస్తుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఒక వ్యక్తి దిగి చుట్టుపక్కల గమనించి రామా మెడలో ఆరు తులాల బంగారపు చైన్ లాక్కొని పరారయ్యారు. పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన దొరకలేదని బాధితురాలు పేర్కొన్నారు. చైన్స్ స్నాచింగ్ వరుస సంఘటనల వలన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇల్లు విడిచి బంధువుల ఇంటికి కానీ శుభకార్యాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా ఏ సమయంలో పడితే ఆ సమయంలో చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల కోరుతున్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News