Tuesday, March 10, 2026

ఉత్తమ యువరైతు పురస్కారం

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ఉత్తమ యువ రైతు పురస్కారం అందుకున్న ఇమ్మడి ప్రవీణ్ పటేల్

నేటిసాక్షి, ప్రతినిధి మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) :
జూబ్లీహిల్స్ రూట్స్ కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా యువ రైతు పురస్కార కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రోపెసర్ కోదండరాం చేతులమీదుగా ఉత్తమ యువ రైతు పురస్కారం అందుకున్న ఇమ్మడి ప్రవీణ్ పటేల్ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువ దినోత్సవం సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన
యువ రైతు పురస్కార కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామానికి చెందిన ఇమ్మడి ప్రవీణ్ పటేల్ ఉత్తమ యువ రైతు పురస్కారం అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రూట్స్ కాలేజీ అధినేత భిక్షపతి పడాల పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల వచ్చిన యువ రైతులకు పురస్కారాలు అందజేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ యువ రైతులు సంఘటితం అయి కొత్త రకపు వ్యవసాయాన్ని చేయాలని సూచించారు.భిక్షపతి పడాల మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భావి తరాలకు శుభ పరిణామం అని సందేశం వ్యక్తం చేశారు. సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ మాట్లాడుతూ దేశమంటే మట్టి, మనుషులు మాత్రమే కాదు యువకులు, రైతులు అని,యువకులు రైతులుగా మారి వ్యాపార దోరణిలో బంగారాన్ని పండిస్తే మన దేశం విశ్వ గురువుగా మారుతుంది ఆశాభావం తెలియజేశారు. సంస్థ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ శ్రవణ్ మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతు, యువ రైతులంతా జై జవాన్, జై కిసాన్ అనే నినాదం తో ముందుకు సాగాలని పిలుపు నీ ఇచ్చారు. అలాగే జనవరి 12 తేదీని కేంద్ర ప్రభుత్వం యువ రైతు దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీ రాష్ట్ర యువ నాయకుడు రాజేష్ శామీర్ పెట్ మాట్లాడుతూ యువకులు సరైన దిశలో నడవాలని కోరారు. ఈ కార్య్రమంలో పురస్కారాలు పొందిన యువ రైతులు ముఖ్య అతిథులతో వ్యవసాయం గురించి చర్చ గోష్టి చేయటం విశేషం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News