Tuesday, March 10, 2026

మెగా రక్తదాన శిబిరం విజయవంతం

  • 50 మందికి పైగా రక్తదానం

నేటి సాక్షి, కమలాపూర్ :
కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కు విశేష స్పందన లభించింది. వివేకానంద జయంతి, జాతీయ యువజన ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి 50 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని స్థానిక సీఐ హరిక్రిష్ణ, వైద్యులు వరుణ్ మాధవ్, ప్రియాంక, యూత్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బాలసాని కుమారస్వామి, పబ్బు అశోక్ చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. 25 సంవత్సరాలుగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని సిఐ హరిక్రిష్ణ అభినందనలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం జనవరి 12న యువజన ఉత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని యూత్ అధ్యక్షులు కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News