నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా (ప్రతినిధి భక్త కుమార్):
సంక్రాంతి పండుగ సందర్భంగా అర్చన విద్యాసంస్థలలో ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డి. సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిభింబించేలా ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు మండిపల్లె రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అర్చన విద్యాసంస్థల కరెస్పాండెంట్ డా పి మదన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ సంస్కృతిలో బండలాగుడు పోటీలు ఒక భాగమన్నారు. సంస్కృతి,సాంప్రదాయాలను పెంపొందించేందుకు అర్చన విద్యాసంస్థల అధినేత మదన మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారన్నారు. సంక్రాంతి సందర్భంగానే మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారన్నారు. పోటీలలోని విజేత ఎద్దులకు బహుమతుల ప్రదానం చేసిన మదన మోహన్ రెడ్డి మరియు వారి కుటుంభ సభ్యులు.





