Wednesday, March 11, 2026

పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళనం

నేటి సాక్షి, సిరిసిల్ల :
2000 – 2001 పదవ తరగతికి చెందిన విద్యార్థులు సిరిసిల్ల పట్టణంలో రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన వర్ధిని హై స్కూల్ కరస్పాండెంట్ మందాడి భాస్కర్ రెడ్డి మరియు అప్పటి ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యకు ఉన్న అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాలో ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది. విద్యార్థిని విద్యార్థులు అత్యున్నత స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమని ఇలాగే రానున్న తరానికి ఆదర్శవంతం కావాలని స్నేహానికి ఉన్న విలువలను ఇట్టి కార్యక్రమంతో మరింత బలపడతాయనీ విద్యార్థిని విద్యార్థులు మరింతగా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని పోకల కిరణ్, రాంబాబు, మోర శ్రీహరి, భాను, కొండవేని కిరణ్, వేణు, రాజ్యలక్ష్మి తదితరులు నిర్వహించినారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News