జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి డి. మాధవరావు
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం నిరంతరం పోరాడే ఏకైక యూనియన్ టీయూడబ్ల్యూ జె ఐజేయూ అని జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి డి మాధవరావు అన్నారు. ఐజేయు రాష్ట్ర కార్యదర్శి జి మధు గౌడ్ పిలుపు మేరకు ఆదివారం నాడు మండల కేంద్రం లోని ఎంఈఓ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు, కార్యక్రమానికి జిల్లామాజీ ప్రధాన కార్యదర్శి డి. మాధవరావు మండల ఇంచార్జ్ లు కె. రాజేందర్, వెంకట్ గౌడ్, విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నే వనపర్తి జిల్లా లో అత్యంత పటిష్టమైన, బలమైన సభ్యుల గల యూనియన్ ఐజేయు ఉందన్నారు. జర్నలిస్ట్ ల కోసం నిరంతరం కృషి చేసే నాయకత్వం వనపర్తి జిల్లా ఉన్నదన్నారు. గత 10 సంవత్సరాలుగా జిల్లాలో ఎన్నో కార్యక్రమాలకు వనపర్తి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. యూనియన్ కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వారికి యూనియన్ లో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఖిల్లా ఘనపురం మండలంలో ఓకేమాట ఒకే యూనియన్ అన్న పట్టుదలతో మార్గదర్శకంగా నిలిచారన్నారు. మండలంలోని జర్నలిస్టులంతా ఐక్యతతో యూనియన్ సభ్యత్వాన్ని జిల్లా నాయకుల చేతుల మీదా స్వీకరించారు. అనంతరం మండల కమిటీ ఎన్నికను జిల్లా నాయకుల పర్యవేక్షణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖిల్లా ఘణపురం మండల అధ్యక్షులుగా ఏ, కృష్ణయ్య (సాక్షి), ఉపాధ్యక్షులుగా టీ యాదయ్య (ఈనాడు), ప్రధాన కార్యదర్శిగా ఏ సత్యనారాయణ (వెలుగు), కార్యదర్శిగా డి విజయ్ (జనంసాక్షి), కోశాధికారిగా కే శాంత కుమార్ (ఆంధ్రజ్యోతి) గౌరవ సలహాదారులు కే సాయిలు (వార్త), కే బాలరాజు(నమస్తే తెలంగాణ) ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు నూతన కమిటీ సభ్యులను శాలువా కప్పి సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రిపోర్టర్ లు పాల్గొన్నారు.





