Wednesday, March 11, 2026

కౌశిక్ రెడ్డికి మద్దతుగా బిఆర్ఎస్ శ్రేణుల నిరసన … పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

నేటిసాక్షి, రాయికల్:
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని అగౌరవపరిచి, దిష్టిబొమ్మ దహనం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాయికల్ పట్టణంలో సోమవారం బిఆర్ఎస్ శ్రేణులు పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. బిఆర్ఎస్ అధ్యక్షులు బర్కం మల్లేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు స్టేషన్కు వెళ్లి కౌశిక్ రెడ్డి పట్ల అనుచితంగా వ్యవహరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు ఎలిగేటి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు అనుమల్ల మహేష్, సాగర్ రావు , పట్టణ కౌన్సిలర్, వల్లకొండ మహేష్ గౌడ్, మాజీ జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు దొంతి నాగరాజు, రాజేందర్ రెడ్ది, ప్రతాప్ రెడ్డి, వినోద్, రాంచంద్రం, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News