Wednesday, March 11, 2026

అర్ధరాత్రి కత్తిపోట్ల కలకలం

నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి (గుండ ప్రశాంత్ గౌడ్):
ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది తాగిన మైకంలో లెక్కల శ్రీనివాస్ వ్యక్తి కొసరి సత్తయ్య రాకేష్ అనే తండ్రి కొడుకుల పై కోడి కత్తితో దాడి చేశారు ఈ దాడిలో రాకేష్ కు తొడలు సత్తయ్యకు గుండెలపైన కత్తిపోట్లు కాగా తండ్రీ కొడుకులు ఇద్దరు త్రీవంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు శ్రీనివాస్ సత్తయ్య ఇద్దరు కలిసి సానికంగా ఉన్న బెల్ట్ షాప్ లో మద్యం సేవించారు ఈ క్రమంలో నే శ్రీనివాస్ సత్తయ్య మధ్యన గొడవ చెలరేగింది గొడవ చేసుకుంటూనే ఇద్దరు మరింత మద్యం సేవించారు అనంతరం సత్తయ్య ఇంటికి చేరుకొని గొడవ విషయం రాకేష్ కొడుక్కి చెప్పుకోగా ఈ క్రమంలో బెల్ట్ షాప్ నుంచి ఇంటికి వెళ్తున్న శ్రీనివాస్ పై తండ్రి కొడుకులు దాడి చేసినట్టు సమాచారం ఆ దాడి నుంచి తప్పించుకొని శ్రీనివాస్ తన ఇంటికి వెళ్లి కోడి కత్తి పట్టుకొచ్చి తండ్రి సతయ్య కొడుకు రాకేష్ పై దాడి చేశాడు ఈ దాడిలో వారిద్దరికి తీవ్ర గాయాలు కాగా జగిత్యాల ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News