Wednesday, March 11, 2026

కటకటాల్లోకి నెట్టిన ‘ఇన్స్ స్టా గ్రామ్-పోస్టులు’

  • ‘థైస్ అండ్ లెగ్స్’ అకౌంట్ హోల్డర్ పై కేసు
  • మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జగిత్యాల పోలీసులు

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో:
సోషల్ మీడియా వేదికలపై ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు పదే పదే చెప్తున్నా కొంతమంది వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు.తమ అతి తెలివితో పెడదారిలో పయనిస్తున్న వారు పోలీసులకు రెడ్ హైండెడ్ గా దొరికిపోతున్నారు. మహిళలకు సంబంధించి ఫోటోలను అభ్యంతరకరంగా ఎడిట్ చేసి ‘ఇన్ స్టా గ్రామ్’ అకౌంట్ లో షేర్ చేస్తున్న ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్ పూర్ కు చెందిన బండారి శ్రవణ్ జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో మొబైల్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతూ మహిళల ఫోటోలు తీస్తు వాటిని ఎడిట్ చేసి ‘థైస్ అండ్ లెగ్స్’ అనే పేరుతో ఓపెన్ చేసిన తన ‘ఇన్ స్టా గ్రామ్’ అకౌంట్లో పోస్ట్ లు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 11 న జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతిక ఆధారంగా నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు.

తోలువలుస్తాం : జగిత్యాల డిఎస్పీ రఘుచందర్
ఐటీ యాక్టుతో పాటు పలు బీఎన్ఎస్ యాక్టు సెక్షన్లలో కేసు నమోదు చేశామని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మీడియాకు వివరించారు. సదరు నిందితుడు రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ మహిళల ఫోటోలను తీసి వాటిని ఎడిట్ చేసి ‘థైస్ అండ్ లెగ్స్’ ఇన్ స్టా గ్రామ్’ అకౌంట్లో షేర్ చేస్తున్నాడు. అసభ్యకరమైన కామెంట్లు కూడా చేస్తున్నారని పోలీసులు గుర్తించి నిందితునిపై కఠినంగా వ్యవహరించారు. అయితే బండారి శ్రవణ్ తీసిన ఈ అకౌంట్ ను బ్లాక్ చేయించామని డీఎస్పీ రఘు చందర్ వెల్లడించారు.ఇక నుంచి ‘సోషల్ మీడియా’లో అసభ్యకరంగా.. అభ్యంతరకరంగా ‘పోస్టులు’ పెడితే వారిపై కేసులు పెడతామని..ముందు తోలువలుస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News