నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ మాట్లాడుతూ చిన్న వయసులో వనపర్తి పట్టణ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఏ రాజశేఖర్ గౌడ్,జిల్లా కౌన్సిల్ సభ్యులు జి.గోపీనాథ్ యాదవ్ కు జిల్లా పార్టీ తరఫున సన్మానం చేయడం జరిగింది. మున్సిపాలిటీ లోనీ 33 వార్డులలో సీనియర్ నాయకులను కార్యకర్తలను గుర్తించి పట్టణ కమిటీలో అన్ని వార్డుల నుండి కమిటీ నియమించుకోవాలని రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలను వార్డులలో నిర్వహించాలని తద్వారా కౌన్సిలర్ కు పోటీ చేయబోయే నాయకులు వార్డు ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుందని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పక్కాగా కార్యచరణ రూపొందించుకుని వనపర్తి మున్సిపాలిటీ పై కాషాయం జండా ఎగురవేసే వరకు విశ్రమించవద్దని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నూతన పట్టణ అధ్యక్షుడు ఏ.రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ 2007-08 కాలంలో ఏబీవీపీ సివి రామన్ కళాశాల అధ్యక్షుడిగా 2010-18 మధ్య కాలంలో హిందు వాహిని పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడిగా 2018లో బిజెపి సభ్యత్వం తీసుకొని 2020లో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగి నేడు పట్టణ అధ్యక్షులు ఎందుకు చేసినందుకు బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ మరియు బిజెపి రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులు అందరికీ ధన్యవాదాలు రుణపడి ఉంటానని పార్టీ విస్తరణ దీక్షంగా లక్ష్యంగా జీవితాన్ని పార్టీకి అంకితం చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డి నారాయణ,ప్రతినిధి బి శ్రీశైలం, ఓ బిట్స్ మోస్త రాష్ట్ర నాయకులు చిత్తారి ప్రభాకర్,జిల్లా ఉపాధ్యక్షులు బండారు కుమారస్వామి,రామన్న గారి వెంకటేశ్వర్ రెడ్డి,జిల్లా కోశాధికారి బాసెట్టి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇన్చార్జి పెద్దిరాజు, జిల్లా అధికార ప్రతినిధులు గొర్ల బాబురావు, గజరాజుల తిరుమలేష్,ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఆగబోవు కుమార్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండి ఖలీల్, పట్టణ ప్రధాన కార్యదర్శి సూగూరు రాములు,పికీలు అరవింద్,నవీన్ ఆచారి, నరేంద్ర,భూపతి, బొడ్డుపల్లి వెంకటేష్, వెంకటేష్ నాయుడు లక్ష్మీనారాయణ రవికుమార్ సుబ్రహ్మణ్యం ఉందేకోటి అంజి, బొడ్డుపల్లి కొండన్న,సిల్మార్తి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.





