మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి
అమెజాన్ సాయంతో మీర్ఖాన్పేట్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం.
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) :
మహేశ్వరం నియోజకవర్గం లోని కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ గ్రామంలో అమెజాన్ సమస్త సహాయంతో నిర్మించిన డ్వాక్రా భవన్, గ్రంథాలయం, అంగన్వాడి స్కూల్, మంచినీటి ప్లాంట్, ఓపెన్ జిమ్, మరియు పార్క్ వంటివి నేడు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ….. మహేశ్వరం నియోజకవర్గంలో అమెజాన్ సంస్థ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలిపారు. మీర్ఖాన్పేట్ ప్రజలకు విజ్ఞప్తి దయచేసి ఎవరు కూడా ఫార్మాసిటీలో ప్లాట్లు అమ్ముకోవద్దని రాబోయే భవిష్యత్తు ఉంటుందని మరిన్ని కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి దయచేసి ఎవరూ కూడా ప్లాట్లు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమెజాన్ సంస్థ ప్రతినిధులు, మరియు కందుకూరు మండలం నాయకులు మీర్ఖాన్పేట్ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.





