నేటి సాక్షి ప్రతినిధి, తిరుపతి జిల్లా :
రామచంద్రపురం మండలం కమ్మపల్లిలో సంక్రాంతి పండుగల్లో మొదటి రోజైన భోగి పండుగ పురస్కరించుకుని ఉదయం భోగి వేసిన గ్రామస్తులు అనంతరం మన సంప్రదాయాలను ఉట్టిపడేలా, గంగిరెద్దు, హరిదాసు, చెక్కభజనల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి వీధుల్లో తిరుగుతూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధికార ప్రతినిధి చిన్న బాబు మాట్లాడుతూ మన సంప్రదాయాలను మరుగున పడకూడదని ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మాగ్రామ ఆడపడుచులను సంక్రాంతికి దూరప్రాంతాల ఉన్నా సరే ఆహ్వానించి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ప్రతి ఏడాది ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామన్నారు. నాలుగు రోజులు కూడా గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చివరి రోజున అందరూ ఒకచోట కలిసి సహపంక్తి భోజనాలు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన వంటలు తయారు చేసే పోటీలను మగవారికి కేటాయించడం మా ప్రత్యేకత అని చెప్పారు. సంక్రాంతి పండుగ రోజున మా ఊరి ఆడపడుచులు ఎక్కడ ఉన్నా స్వగ్రామానికి చేరుకోవడం ఒక ఆనవాయితుగా నియమించుకన్నట్లు తెలిపారు గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంఠ చౌదరి మాట్లాడుతూ మాకు సంక్రాంతి పండగ వచ్చిందంటే సంప్రదాయాలను అనుసరించి జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం మా యొక్క గ్రామానికి ఉన్న ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మపల్లి గ్రామస్తులు, మహిళలు, యువత, ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





