నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరి రాహుల్ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా స్థాయి మరిచి ఒక రౌడీగా ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల పరువును తీశాడని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్, మైనార్టీ నాయకులు అప్సర్, మహిళా నాయకురాలు పుష్పలత, కిరణ్, తౌసిఫ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.





