- అన్నదాన సత్రం కోసం 40 లక్షల విరాళంగా అందించిన మంత్రి పొన్నం..
- శ్రీశైలం తరహాలో మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటుకు కృషి
- రాజన్న అన్నదాన సత్రానికి విరాళాలు అందించండి..
- రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు..
- రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
దేశ వ్యాప్తంగా ఎంతో చరిత్ర ఉన్నా కోరిన కోర్కెలు తీర్చి పేదల పెన్నిధి దక్షిణ కాశీగా పేరొందిందని, 77 కోట్లతో ఆలయం అభివృద్ధికి శంఖు స్థాపన చేసుకున్నామని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా రాజన్న ఆలయ అభివృద్ధి చేస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి మహా పర్వదినాన సందర్బంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్,అడ్లురి లక్ష్మణ్ కుమార్ తో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడ ఆలయ గెస్ట్ హౌజ్ లో విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి, ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో, ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్నని అన్నారు. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని, ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్ తో పాటు నాది, ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం భవన నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని, 35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతుందని, అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే 20 కోట్లు ఉన్నాయని, దానిని వంద కొట్లీ చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది ఈ ప్రాంత ప్రజలదని అన్నారు. అన్నదాన సత్రం కోసం మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు కలిసి 40 లక్షలు ఆ స్వామి వారి నిత్యాన్నదాన సత్రం కు విరాళం ఇస్తున్నామని, రాజరాజశ్వర స్వామి భక్తులు, డోనర్స్ ఉంటే విరాళాలు ఇవ్వాలని అన్నారు. దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో రశీదులు తీసుకొని విరాళాలు ఇవ్వలని, స్థానిక శాసన సభ్యులు, ఈవో నీ కలిసి విరాళాలు ఇవ్వచ్చుఅని, ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం తో నిత్యాన్నదాన సత్రం విజయవంతం కావాలని అన్నారు. అందరూ సహకరించండి, వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్ కి సంబంధించి విరాళాలు ఏవి ఇచ్చిన సరే అని, రైతులు బియ్యం, కూరగాయలు కూడా ఇవ్వచ్చు అని అన్నారు. మేము ఇద్దరం కలిసి హైదరాబాద్ లో డోనర్స్ ను కలుస్తామని అన్నారు. వేములవాడ దర్శనంలో కోడె టికెట్, అభిషేకం టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నామని, తిరుపతి లాగ అందరికీ ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు కానీ టికెట్ తీసుకోవాలి అని అన్నారు. బ్రేక్ దర్శనం ఆలస్యం లేకుండా త్వరత్వరగా జరుగుతుందని, మహా శివరాత్రి కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారని అన్నారు. శ్రీశైలం లో ఉన్న మాదిరి మ్యూజికల్ ఫౌంటెన్, వేములవాడ లో లార్డ్ శివ ఉండేలా చేస్తున్నామని ధర్మపురి నుండి ఏసీ బస్సు స్టార్ట్ అయిందని, వేములవాడ నుండి కూడా ఏసీ బస్సు ప్రారంభిస్తామని, వేములవాడ బస్ స్టాప్ ను అభివృద్ది చేస్తామని అన్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ… వేములవాడ ఆలయ అభివృద్ధికి కి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని అన్నారు. నా కోరిక తిరుమల లో ఉన్న వెంగమాంబ మాదిరిగా ఇక్కడ శాశ్వత అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని, వేంటనే మంత్రి పొన్నం పట్టుబట్టి అన్నదాన సత్రం మంజూరు చెపించారని అన్నారు. ఇప్పటికే అన్నదాన సత్రం ట్రస్ట్ లో 20 కోట్లు ఉన్నాయని, అన్నదాన సత్రం భవనం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి 35 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఈ సందర్బంగా మంత్రిపొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. 20 కోట్లు ఉన్న అన్నదాన సత్రం ను 100 కోట్లకు పెంచుకుంటమని,దాతల విరాళాలు డిస్ ప్లే బోర్డులో వేయడం జరుగుతుందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నదమ్ములు 40 లక్షలు అన్నదాన సత్రం కోసం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నని, నా తల్లి తండ్రి, కొడుకు పేరు మీద 10 లక్షలు అన్నదాన సత్రం కి విరాళం ఇస్తున్నానని అన్నారు. హైదరాబాద్ నుండి వేములవాడ కి రెండున్నర గంటలని, భక్తులకు విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ ప్రజలు ఆలయాన్ని సందర్శించలని,ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దేవాలయాలు దర్శనం చేసుకోవచ్చుని అన్నారు. వేములవాడ ఆలయాన్ని టూరిజం గా కూడా అభివృద్ది చేస్తమని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఆలయ విస్తీర్ణం, రోడ్ల విస్తీర్ణం, అన్నదాన సత్రం నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ జరుగుతుందని, ఆలయం లోకి రాగానే ఆహ్లాదకర వాతావరణం ఉండేలా అభివృద్ది చేస్తున్నామని అన్నారు.





