కేయూసీ రవికుమార్
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు):
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇంటిలో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని బ్యాంకు లాకర్లో పెట్టుకొని గాని లేదా మీతో పాటు తీసుకువెళ్లాలని కేయూ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా సోమవారం ఇన్స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మీరు వెళ్లే ముందు మీ ఇంటికి పేపర్, పాల ప్యాకెట్, వేసే వాళ్లకు మీరు ఇంటికి తిరిగి వచ్చేవరకు వేయవద్దని చెప్పాలన్నారు మీ ఇంటికి అమర్చిన సిసి కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలని వాటిని మీ మొబైల్ కు లింకు చేసుకొని ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలిపారు. మీ ఇంటి మెయిన్ రోడ్డు తాళం వేసినప్పుడు తాళం కనిపించకుండా డోర్ కర్టెన్ వేయాలని అలాగే ఇంటి మెయిన్ గేటుకు తాళం కలిగించకుండా వేసుకోగలరని సూచించారు మీరు తిరిగి ఇంటికి వచ్చేవరకు ప్రతి రోజు మీ ఇంటి పక్క వారిని మీ ఇంటి తాళాలను చెక్ చేయమని చెప్పాలన్నారు మీ ఇంట్లో పని చేసే పని మనుషులను ప్రతిరోజు మీ ఇంటి ముందర శుభ్రం చేసి ముగ్గులు వేయాలని నిఘా ఉంచమని ఇంటి హాల్లో గాని బయట గాని బల్బు వెలిగే విధంగా చూసుకోవాలని మీరు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు కేయూ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. పై విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంటిలో ఎలాంటి దొంగతనాలు జరగవని తగు జాగ్రత్తలు తీసుకుంటామని మా పోలీస్ స్టేషన్ తరఫున కూడా ముమ్మరమైన పెట్రోలింగ్ చేయుచు క్రైమ్ బ్లూ కోల్డ్ పోలీస్ అధికారులు గస్తీ తిరుగుతూ తాళం వేసిన ఇళ్లపై ప్రత్యేకంగా ఉంచుతామని ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.





