నేటిసాక్షి, భీమదేవరపల్లి :
ధర్మారం గ్రామంలో సామాజిక ఉద్యమ నేత, బీఎస్పీ ఉమ్మిడి జిల్లా కరీంనగర్ మాజీ అధ్యక్షులు, తెలంగాణ జేఏసీ నాయకుడు, విద్యా వంతుల వేదిక నాయకులు, అంబేద్కరిస్ట్, చెప్యాల ప్రభాకర్ మృతి చెందారు. ఈ సందర్భంగా Dtf రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్, జెసి డివిజన్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి, సైదాపురం మాజీ ఎంపీపీ పొడిసెట్టి వెంకట్రాజం, సదానందం, జగన్నాథం, వేల్పుల ప్రభాకర్ లు ఆయన మృతదేహానికి సంతాపం తెలిపి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.





