– రూ.5 వేల లంచం తీసుకుంటూ పట్టివేత

నేటిసాక్షి, మెట్ పల్లి:
జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి సబ్ రిజిస్ట్రార్ ఆసిఫోద్దిన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు. మెట్ పల్లి పట్టణంలో సాయిరాం కాలనీ లోని 266 గజాల స్థలం ను మార్టిగేజ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ పదివేలు డిమాండ్ చేయగా మొదటి విడతలో రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుపడ్డారు. బాధితుడు ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు గా తెలిసింది. మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫోద్దీన్, ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు





