Wednesday, March 11, 2026

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

  • సీఐ ఈ హరికృష్ణ
  • కమలాపూర్ పోలీస్ వారి ముఖ్య సూచనలు

నేటి సాక్షి, కమలాపూర్ (ఎడ్ల నాగరాజు) :
కమలాపూర్ మండల ప్రజలందరికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపిన సిఐ ఈ హరికృష్ణ ఆ తదనంతరం కమలాపూర్ మండలం ప్రజలకు పలు సూచనలు చేశారు. గత కొద్దీ రోజులుగా సంక్రాంతి సెలవులు రావడం చాలా మంది ప్రజలు వారి స్వగ్రామాలకు వెళ్లడంతో ఇది అదనుగా భావించి కొంతమంది దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కమలాపూర్ ఏరియాలో దొంగతనాలను నివారించడం కోసం ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని లోకల్ ఏరియాలో ఎవరైనా అపరిచితమైన వ్యక్తులు గాని, అనుమానస్పదంగా ఉన్న వ్యక్తులు ఏ సమయంలో నైనా కనిపించిన 8712685125 కు గాని, 8712685249 నెంబర్ కు గాని తెలిపి పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సిఐ హరికృష్ణ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News