- ముఖ్య అతిధిగా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి
నేటి సాక్షి, కమలాపూర్ (ఎడ్ల నాగరాజు) :
కమలాపూర్ మండల కేంద్రంలోని బుధవారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నాలుగు సంక్షేమ పథకాల పై మండల, గ్రామస్థాయి సిబ్బందికి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల ప్రజా పరిషత్ సమావేశం లో జిల్లా కలెక్టర్ హనుమకొండ ఆదేశాల మేరకు ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఆహర భద్రత కార్డుల జారి,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, మార్గదర్శలపై అవగాహన కల్పించుటకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు,రెవెన్యూ అధికారులు,పంచాయతీరాజ్ అధికారులు,ఉపాధి హామీ సిబ్బంది మరియు అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి 26న ప్రారంభించనున్న పథకాలను, ప్రజలకు,ప్రభుత్వానికి సమన్వయంగా పనిచేస్తూ విజయవంతం చేయడానికి, పేద ప్రజలకు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా ఏడి రవీందర్ సింగ్,మండల తాసిల్దార్ ఏం.సురేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి రాజ్ కుమార్,గ్రామ ప్రత్యేక అధికారులు మరియు ఉపాధి హామీ సిబ్బంది,ఆర్ ఐ లు,ఎ ఈ ఓ లు,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్స్, మండల సిబ్బంది పాల్గొన్నారు.





