నేటిసాక్షి,గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండల కేంద్రం గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బొడ్డు బాలయ్య ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కలిసి మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో కొట్టె భూమయ్య, చిగురు అంజయ్య, కొలుపుల వేణు, పుల్లెల రాము తదితరులు పాల్గొన్నారు





