ఫైనల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులు అందజేసిన పుర ప్రముఖులు.
నేటిసాక్షి ప్రతినిధి, చందుర్తి( సతీష్ ) :
చందుర్తి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ మైదానంలో సంక్రాంతి పండుగ హాలిడేస్ సందర్భంగా సీ స్క్వేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ (బిల్డింగ్ కన్స్ట్రక్షన్ )వన్ ఆఫ్ ద చైర్మన్ ఓరగంటి వెంకటేష్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సిపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ముగిసింది. ఫైనల్లో మార్త రాజు జట్టు రాకేష్ జట్టు తలపడగా వార్త రాజు జట్టు గెలుపొందింది. గెలుపొందిన ప్రథమ ద్వితీయ స్థానాల జట్లకు స్థానిక ప్రముఖులు బహుమతులు అందజేశారు. సిపిఎల్ సీజన్ తో యువకులను క్రీడల వైపు మళ్లిస్తూ హాలిడేస్ లో యువకులు క్రికెట్ లో ఎంతో ఎంజాయ్ ఫుల్ గా పాల్గొని మళ్లీ పాత రోజులను గుర్తు చేసేలా యువకులను ప్రోత్సహిస్తున్న ఓరగంటి వెంకటేశ్ ను నిర్వాహకులను పుర ప్రముఖులు అభినందించారు.





