ఆచూకి లభిస్తే పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి..
నేటిసాక్షి ప్రతినిధి, చందుర్తి (సతీష్):
చందుర్తి మండలం నర్సినపూర్ గ్రామానికి చెందిన జిల్లా రమాదేవి (65) అనే మహిళా గత సంవత్సర క్రితం అదృశ్యమయింది. పోలీసుల కథనం ప్రకారం రమాదేవి 25జూన్ 2023న వేములవాడ లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనంకు వెళ్లి ఇంటికి చేరుకోలేదు. బంధువుల ఇండ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో 29 జూన్ 2023న రమాదేవి కూతురు సామ కళ్యాణి తమ తల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పటినుండి మహిళ ఆచూకీ కోసం వెతికినప్పటికీ లభ్యం కాలేదన్నారు. సదరు మహిళ ఆచూకి లభిస్తే చందుర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై ఫోన్ నెంబర్ 8712656420 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.





