Wednesday, March 11, 2026

జిల్లా బీసీ సంక్షేమ సంఘం న్యాయ సలహాదారుని ఎన్నిక..!

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం ఆధ్వర్యంలో జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం న్యాయ సలహాదారుగా జెట్టి శేఖర్ ను నియమిస్తూ నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మేకల పరుశురాం మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గత 30 సంవత్సరాల నుండి చేపట్టిన సుదీర్ఘ పోరాటం బీసీ లో 134 కులాలను ఏకం చేసి విద్య, ఉద్యోగ, రాజకీయ, రంగాల్లో వాటా సాధించటానికి ఎంతో కృషి ఉందన్నారు. ఈ ఉద్యమం గ్రామస్థాయిలో ఇంటింటికి తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో మేమెంతో మాకంత, అనే నినాదంతో మన వాటా మనం, సాధించుకునేంతవరకు ఉద్యమించాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భైరవని గోపి గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, కార్యదర్శులు ఎడ్ల నరేందర్, సిలివేణి మల్లేశం, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమురవ్వ, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కాసర్ల అరుణ్, ఉపాధ్యక్షులు కిరణ్ గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం నరేష్, అర్బన్ మండల అధ్యక్షురాలు మ్యానా సుమ, ప్రధాన కార్యదర్శి చొక్కల నిరంజనీ మండల ఉపాధ్యక్షులు సురా రాము, కార్యదర్శులు సామల రమేష్, చిగుర్ల పర్శరాములు, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News