Wednesday, March 11, 2026

బీజేపీ మాట ఇస్తే అది నెరవేస్తుంది

పసుపు భోర్డు తో రెతుల కల్లలో అనందం
బిజెపి ఇబ్రహింపట్నం మండల అధ్యక్షుడు బాయి లింగరెడ్డి

నేటీ సాక్షి,ఇబ్రహింపట్నం :
భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో గత 5 దశాబ్ధాల కల సాకారం చేస్తూ, భారత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, ఇందురు పార్లమెంట్ ప్రజల ఆకాంక్ష అయిన పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈమేరకు జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండల కేంద్రం లో మండలం అధ్యక్షులు బాయి లింగారెడ్డి ఆధ్వర్యంలో భారత దేశ ప్రదాని నరేంద్ర మెది తదితర నాయకుల చిత్రపటలకు పాలభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా లింగరెడ్డి మాట్లాడుతూ బీజేపీ మాట ఇస్తే అది నెరవేస్తుంద అని, ఆది కాశ్మీర్ 370 ఆర్టికల్ విషయమైన, ఇటీవల మొదటి వార్షికోత్సవం అయిన అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం అయిన, ఇప్పుడు పసుపు బోర్డు అయిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది ఈ దేశంలో ఒక భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. పసుపు బోర్డు కల ఇందురు గడ్డ పైన ప్రకటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు పసుపు బోర్డు ఏర్పాటులో కీలకమైన మన ఇందురు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు.పసుపు బోర్డును ఇందురులో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా , పీయూష్ గోయల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎబివిపి నుండి భారతీయ జనతా పార్టీకి విధేయుడు, రైతు బిడ్డ ఆయన పల్లె గంగారెడ్డి కీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, పంతగి వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి మండల ఉపాధ్యక్షలు తిరుమల చారి, కార్యదర్శిలు సతీష్, స్వామి, దేవన్న మోర్చాల అధ్యక్షులు శ్రీనివాస్, నవీన్ రెడ్డి, సురేష్, రాజారెడ్డి బూత్ అధ్యక్షులు , శక్తి కేంద్రం ఇన్చార్జిలు, ముఖ్య బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News