Wednesday, March 11, 2026

ప్రధాని, ఎంపీల చిత్రపటాలకు పాలభిషేకం

నేటి సాక్షి, మల్లాపూర్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పస్పు బోర్డు ఏర్పాటు చేయడం హర్షిదాయకమని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో గల భరతమాత కూడలి వద్ద మంగళవారం గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… పసుపు రైతుల దశాబ్దాల కళ కోసం ఉద్యమం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎంపీ అర్వింద్ అని 2018 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుండి అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర పసుపు బోర్డును కూడా నిజామాబాద్ లోనే ఏర్పాటు చేయడం వల్ల స్థానిక రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. కోరుట్ల నియోజకవర్గం లో నవోదయ కేంద్రీయ విద్యాలయం కూడా ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ నిరుపేద విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ముష్కరి రాజ్ కుమార్,జిల్లా మహిళ విభాగం కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, బీజేపీ లీడర్స్ లవంగా శివకుమార్, దురిశెట్టి కిరణ్, చింతకుంట బన్నీ, మిట్టపల్లి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News