Wednesday, March 11, 2026

మనస్థాపంతొ పురుగుల మందు తాగి మృతి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ )
ధర్మపురి మండలం తుమ్మేనాల గ్రామానికి చెందిన నక్క విజయ్ కుమార్ అను అతడు జీవన ఉపాధి కొరకు పొలాండ్ దేశం కు వెళ్లి వస్తుంటాడు, తాను పొలాండ్ దేశంలో ఉన్నప్పుడు తన స్నేహితులకు డబ్బు ఇచ్చినాడు, కానీ తన స్నేహితులను డబ్బు అడగంగా ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది ఆదివారం రోజున తమ యొక్క పత్తి చేనులో పురుగుల మందు త్రాగినాడు చికిత్స గురించి ధర్మపురి హాస్పిటల్ తీసుకుపోగా అతని పరిస్థితి విషమంగా ఉండడం వలన అక్కడి నుండి అంబులెన్స్ లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో చూపించి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని వన్ ఆసుపత్రి అక్కడి నుండి రేణే ప్రవేట్ హాస్పిటల్ లో చేర్పించగా ఈ రోజు అనగా బుధవారం రోజున చనిపోయాడు అని తన తల్లి నక్క నరసవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నామని ఎస్ ఐ ఉదయ్ కుమార్  తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News