Wednesday, March 11, 2026

సంక్రాంతి రైతుల జీవితాల్లో సరికొత్త కాంతిని నింపాలి…

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

నేటిసాక్షి, మంగపేట :
సంక్రాంతి పండుగ రైతుల జీవితాల్లో సరికొత్త కాంతిని నింపాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంగళవారం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివేక ఎఫ్ పి ఓ రైతు ఉత్పత్తిదారుల సంఘం మరియు వికాస్ అగ్రి పౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ పల్లె తల్లి వంటిదని ఏ దేశమేగినా పల్లె మూలాలు మరవద్దని అన్నారు సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ అని సంక్రాంతి పర్వదినం రైతుల జీవితాల్లో కాంతిని నింపే విధంగా ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని ఆయన అన్నారు గంగిరెద్దు రూపంలో ఉన్న నందీశ్వరునికి సాంబశివరెడ్డి దంపతులు సాంప్రదాయ బద్ధంగా హారతి ఇచ్చి ఆహారం తినిపించి నూతన వస్త్రాలు సమర్పించారు అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు ఈ వేడుకల్లో మహిళలు వేసిన రంగవల్లులు పిండివంటలు గంగిరెద్దు విన్యాసాలు పిల్లల పతంగుల ఆటలు అలరించాయి ఈ కార్యక్రమంలో వివేక ఎఫ్ పీ ఓ కార్యాలయ సిబ్బంది బన్నూరి దరనిధర్ రెడ్డి జడ్డి పూర్ణ ప్రసాద్ వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ లు చెట్టుపల్లి తిరుపతి రావు నేలపట్ల శేషారెడ్డి ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News