Wednesday, March 11, 2026

జనవరి 18 లోపు ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయాల తరలింపు పూర్తి కావాలి

  • బస్సు డిపో ఏర్పాటుకు భూమి అప్పగింత పై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి); జనవరి 18 శనివారం లోపు పెద్దపల్లి ఎంపిడీఓ ప్రాంగణంలోని కార్యాలయాల తరలింపు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత బస్సు డిపో ఏర్పాటుకు భూమి అప్పగింతపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,  పెద్దపల్లిలో బస్సు డిపో మంజూరైన నేపథ్యంలో స్థలం అప్పగించేందుకు వీలుగా పెద్దపల్లి ఎంపీడీవో ప్రాంగణంలో ఉన్న కార్యాలయాల తరలింపు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.పెద్దపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, అబ్కారీ శాఖ కార్యాలయం, తరలింపుకు ప్రభుత్వ భవనాలలో అనువైన చోటున ఎంపిక చేసుకోవాలని, అవసరమైతే ప్రైవేటు భవనాలను సైతం  ఎంచుకోవాలని, జనవరి 18 శనివారం లోపు కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు, ఆర్టీసీ ఈ ఈ పోచయ్య లింగం, డిపో మేనేజర్ గోదావరిఖని నాగభూషణం, ఈ ఈ హౌసింగ్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News