Wednesday, March 11, 2026

ఎలాంటి అవినీతికి తావు లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలి

  • గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించారు
  • కాంట్రాక్టర్ నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవు
  • ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

నేటి సాక్షి,పెద్దపల్లి(వోడ్నాల తిరుపతి):
సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని పూసల 13 వార్డ్ లో ప్యాకేజీ – 8 ద్వారా టి యు ఎఫ్ ఐ డి సి 38 లక్షల రూపాయల అంచనాతో నిర్మించబోయే నాలుగు సీసీ రోడ్లు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో సుల్తానాబాద్ ను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు చెప్పారు.ఇప్పటికే సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.15 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. అవినీతికి తావు లేకుండా నాణ్యతతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. మరో ఆరు మాసాల్లో ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలనలో అప్పటి పాలకులు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పట్ల సవతి తల్లి ప్రేమ చూపారని చెప్పారు. అలాగే ప్రజలు అభివృద్ధి పనులకు సహకరించాలని ఆయన కోరారు.సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి ఈ పనులు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో పట్టణ రూపురేఖలను మార్చే అనేక అభివృద్ధి పనులను చేపడతామని ఎమ్మెల్యే విజయరమణ రావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిరి మహేందర్, డి. దామోదర్ రావు, వేగోళం అబ్బయ్య గౌడ్,సిద్ధ తిరుపతి, ఆరెపల్లి రాజేందర్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News