నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, (సందెల రాజు) : డిస్ట్రిక్ట్ ఇమినైజేషన్ అధికారి (డి.ఐ.ఓ) డాక్టర్. ఐ. ప్రకాష్ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ను సందర్శించారు. డాక్టర్. ఐ. ప్రకాష్ మాట్లాడుతూ శారీరక మానసిక బుద్ధి మాంద్యం, చెవిటి ,మూగ, దంత వ్యాధులపై పలు సూచనలు చేసారు. అందించే సేవల పై డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ సిబ్బందికి పలు సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్
అందించే పలు సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పలు ఆరోగ్య శిబిరాల ద్వారా కార్యక్రమాలు చేపట్టడం పేద మరియు మధ్య తరగతి మానసిక ఇంటలెక్చువల్ డిజేబులిటీ గల రోగులకు, ప్రజలకు అందించే సేవలో మరింత ముందు ఉండి మెడికల్ క్యాంపు ల ద్వారా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించాలని, సిబ్బంది పలు సూచనలు ఇచ్చారు. ఆల్ రికార్డ్స్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ పీడియాట్రిషన్ డాక్టర్. మంజుల నాయక్ డెంటల్ సర్జన్ డాక్టర్ శ్రీ లక్ష్మి, డైక్ మేనేజర్ మెరుగు అనిల్ కుమార్, ఫిజియోథెరపిస్ట్ పవన్ కుమార్, సైకాలజిస్ట్ ప్రశాంత్, డెంటల్ టెక్నీషియన్ నూర సంపత్ కుమార్, స్టాఫ్ నర్స్ హేమ, ఆడియాలజిస్ట్ వనజ, ల్యాబ్ టెక్నీషియన్ మాధవి, స్పెషల్ ఎడ్యుకేటర్ రమేష్, సోషల్ వర్కర్ లావణ్య మరియు తదితరులు పాల్గొన్నారు.





