Wednesday, March 11, 2026

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలి

  • జిల్లా కలెక్టర్‌ పి. ప్రావిణ్య

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పి. ప్రావిణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్‌ అండ్‌ బి, పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్య, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్‌ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీ కి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రోడ్డు సేఫ్టీకి తీసుకోనున్న ముందస్తు చర్యల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ప్రావిణ్య మాట్లాడుతూ ఆర్‌అండ్‌ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్థి చేయాలన్నారు. కడిపికొండ ఆర్‌ఓబి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో గూడెప్పాడు వరకూ కొనసాగుతున్న పనులను పూర్తి చేసేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు కృషి చేయాలన్నారు. కటాక్షపూర్‌ వద్ద పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇక వడ్డేపల్లి జంక్షన్‌ నుండి గోకుల్‌ నగర్‌ వరకు సిగ్నల్స్‌ పనిచేసే విధంగా, విద్యుత్‌ లైట్లు వెలిగే విధంగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారుల శాఖ గుడిపాడు జంక్షన్‌ వరకు రోడ్డు పనులను పూర్తి చేయాలి, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వడ్డేపల్లి చర్చి సిగ్నల్స్‌ పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని, విద్యుత్తు లైట్లు వెలిగే విధంగా చర్యలు చేపట్టండి. రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలి. బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద చర్యలు చేపట్టాలని, తరచుగా ప్రమాదాలు జరుగుతున్న చోట్ల వాలంటీర్లు లను నియమించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్ధులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ తెలిపారు. అలాగే పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్ ఝా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. యువత ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని, హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించే విదంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజు రోజుకు వాహనాల వినయోగం పెరుగుతున్నందున అదేస్థాయిలో ట్రాఫిక్‌ పెరుగుతుందన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా, ప్రయాణిస్తే ఎదురయ్యో ప్రమాదాల పట్ల సమాజంలో అవగాహన పెరగాలన్నారు. ట్రాఫిక్‌ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని. ట్రాఫిక్‌ అంశాల పట్ల యువతలో చైతన్యం రావాలన్నారు. ప్రమాదాల బారిన పడిన వారిని గోల్డెన్‌ అవర్‌ గురించి తెలియాలన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ అవేర్నెస్‌ పై అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌ శాఖ రవాణ, ఆర్టీసీ, ఆర్‌ అండ్‌ బి, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత నియమాలకు సంబంధించి అమలు చేయడంలో అన్ని శాఖల బాధ్యత ఉంటుందని, రోడ్లకు ఇరువైపులా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్‌ శాఖ పోలీస్‌ శాఖకు సహకరించాలన్నారు.
ఈ సమావేశంలో గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థ కమీషనర్‌ అశ్వినీ తానాజీ వాఖడే, అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి, అదనపు డి.సి.పి సలిమా, ఆర్‌అండ్‌బి ఇఇ సురేష్‌, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌.అండ్‌.బి, పోలీసు శాఖల, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News