నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కుల మత రాజకీయాలకి అతీతంగా ఉపయోగించుకొని ఆరోగ్యంగా జీవిద్దాం హన్మకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఈ నెల 18 న శనివారం నాడు గ్రామ ముద్దు బిడ్డ డాక్టర్ బరిగెల రమేష్ సారధ్యంలో, డాక్టర్ విమలాకర్ రెడ్డి ఇప్ప, టీం డాక్టర్ విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అతి విలువైన, అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు క్యాంపు నిర్వహణ కమిటీ గ్రామ వాలెంటర్స్ పెండ్యాల సుమన్, బరిగెల చంద్రమౌళి, పురేళ్ల సూర్యం, కేతపాక రవి తెలిపారు. ఈ క్యాంపులో అల్ట్రాసౌండ్ అబ్డొమెన్, యుజిఐ ఎండోస్కోపీ, ప్రొక్టోస్కోపీ, ఫైబ్రోస్కాన్, ఇ సి జి, 2డి-ఎకో, సి బి పి, లివర్ ఫంక్షన్ టెస్ట్, సీరమ్ క్రియాటినిన్, ఆర్ బి ఎస్, లిపిడ్ ప్రొఫైల్, హెచ్ బి ఎస్ ఎ జి, హెచ్ సి వి వంటి ఎంతో విలువైన పరీక్షలు నిర్వహించి వాటి రిపోర్ట్లు అదే రోజు అందించి రోగికి అవసరం అయినా అన్ని సలహాలు సూచనలు ఇస్తారని అన్నారు. ఈ క్యాంపు కి వివిధ రాష్ట్రాల నుండి సుమారు 70 మంది వైద్య బృందం హాజరు కానున్నారు. ఒక్కో పేషేంట్ కి దాదాపు 20 వేల రూపాయల విలువ గల పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఒక్క రోజే సుమారు 300 మంది పేషేంట్స్ కి వైద్య పరీక్షలు నిర్వహించి వాటి రిపోర్ట్లు అదే రోజు అందిస్తారు. కావున ఈ గొప్ప అవకాశాన్ని పరకాల ప్రాంత ప్రజలు వెల్లంపల్లి గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాల ని వారు సూచించారు. కార్యక్రమంలో హెల్త్ క్యాంపు వాలేంటర్స్ పెండ్యాల రవీందర్ ఏకు మనోహర్, మచ్చ నట కిశోర్, మచ్చ సురేష్, విక్రం, సాయి, శోభన్ రాములు తిరుపతి, సురేష్ దినేష్, తదితరులు పాల్గొన్నారు.





