Wednesday, March 11, 2026

అభిమానులు దేవుడిచ్చిన వరం

  • నా అభిమానులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను.
  • మంచు మనోజ్

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) చంద్రగిరి:
సినిమా హీరోలకి, రాజకీయ నాయకులకు అభిమానులు దేవుడిచ్చిన వరమని నా అభిమానులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనని మంచు మనోజ్ తెలిపారు. మనోజ్ అనుచరులు పళణి, వినాయక లు తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని, మంచు మనోజ్ వెనక తిరగకూడదని మమ్మల్ని బెదిరించినారని అడిగినందుకు మంచు విష్ణు అనుచరులు మాపై దాడి చేసినట్లు గురువారం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మంచు మనోజ్ విలేకరులతో మాట్లాడుతూ గొడవ జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం కానీ జరుగుతుంది వాస్తవానికి జరుగుతుంది అభిమానులు అనేది దేవుడిచ్చిన వరం అండ్ నా వెల్ విషెసర్లగా వాళ్లు కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకుంటూ సొంత పనులు చేసుకుని వాళ్ళ అభిమానం చాటుతున్నారన్నారు. ఎనిమిది సంవత్సరాల గ్యాప్ లో కూడా నేను సినిమాలకి దూరంగా ఉన్నాను. జనాలకి దూరంగా ఉన్నాను అనే ఫీలింగ్ తెప్పించకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ నా అభిమానులు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ రుణపడి ఉన్నాను, నాకు అంత సపోర్ట్ ఇచ్చినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరి అభిమానాన్ని ఆపకూడదు. నా అనుచరులు పై దాడి చేసి నా కుమార్తెతో కలిసి మొదటి సంక్రాంతి పండుగను చేసుకోనీకండా చేశారని ఆరోపించారు. 12వ తారీకు నా అనుచరులను పిలిపించి మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఎవరు ఉండకూడదని బెదిరించారన్నారు. క్యాంపస్ లో యూనిఫాంలో తప్పనిసరి చేయటం ఇతరిత్రా మిస్టేక్స్ గురించి అడిగితే దాన్ని డైవర్ట్ చేస్తూ వాడిని వీడిని బెదిరించటం ఎందుకని నిలదీశారు. నేను ముఖ్యంగా సీఎం ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యలో రామ్మూర్తి నాయుడు మృతి చెందటం ఇది చాలా బాధాకరమైన విషయం అందరికీ ఈ సమయంలో వాళ్ళు ఎవరో ఉన్నారు నాని అక్కడున్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. నేను వస్తే వాళ్లు గొడవలు చేస్తారని భావించి ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాతనే నారావారిపల్లి చేరుకున్నానని మంత్రి నారా లోకేష్ నాని లతో సాధారణంగా మాట్లాడానని మా కుటుంబ గొడవల్లో నాకు సహాయం చేయమని అడగలేదన్నారు. నేను నా పెద్దలు సమాధి వద్దకు వచ్చాను గొడవలు చేయడానికి రాలేదు వారు నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. నా అవ్వ తాతల సమాధుల వద్దకు కూడా వెళ్ళటానికి అవకాశం ఇవ్వకుండా గేట్లు మూయించి వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశం చివరలో మనోజ్ కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News