నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : ఎస్పీ ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన టీజేఎఫ్ జర్నలిస్టులు నాయకులు విలేకరులు అయితే ఏం డోంట్ కేర్ అంటున్న చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లోని చాపాడు మండలం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చిన్న పెద్దయ్య ఉన్నత బాధ్యతను మరిచి వ్యవహరించిన తీరని చూస్తే ఇట్లే తెలుస్తోంది.ఆయన రూటే సప రేటుగా వ్యవహరిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న 1 tv జర్నలిస్ట్ జేబీ వుల్లా పై విచక్షణారహితంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన ఎస్సై చిన్న పెద్దయ్య పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీజేఎఫ్( తెలుగు జర్నలిస్టు ఫోరం నాయకులు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వినతిపత్రం అందజేశారు. వార్త కవరేజ్ కోసం వెళ్లిన పొద్దుటూరు రిపోర్టర్ పై చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. జిల్లా కన్వీనర్ శ్రీకాంత్, జిల్లా ఎలక్రానిక్ మీడియా కో కన్వీనర్ రామచంద్ర సలహాదారులు సుధీర్ కుమార్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన చాపాడు ఎస్సై చిన్న పెద్దయ్య పై తక్షణమే చర్యలు తీసుకోవాలి.





