నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : షెడ్యూల్డ్ కులాల పరిరక్షణకు నియమించబడిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ నేడు (శుక్రవారం) వరంగల్ నగరానికి రానున్నారని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద నేడు ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీలకు కల్పించిన హక్కులు, రక్షణ అమలు, బాధితుల కుటుంబానికి చెల్లించే బకాయిలపై కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మ. 2 గం.లకు సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్థారని తదుపరి మీడియా ప్రతినిధులతో నిర్వహించే సమావేశం (ప్రెస్ మీట్ ) లో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.





