- యువజన కాంగ్రెస్ నాయకుడు టేకులశ్రావణ్
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక సైకో మాదిరిగా వ్యవహరిస్తున్నాడని, వాళ్ళ పార్టీ యజమాని మెప్పు పొందడం కోసం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడని అన్నారు. బాద్షా సినిమాలో మాదిరిగా మన ప్రభుత్వం వస్తే నువ్వు మంత్రి అవుతావని చెప్పడంతో ఆ భ్రమల్లో కౌశిక్ రెడ్డి జీవిస్తున్నాడని, కానీ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఒక జోకర్ ని తలపిస్తున్నడని ఎద్దేవా చేసారు. కౌశిక్ రెడ్డి కి మహిళల పట్ల, దళితుల పట్ల గౌరవం లేదని, ఒక మహిళా గవర్నర్ ని సైతం అసభ్య పదజాలంతో దూషించి మహిళా కమిషన్ వద్ద క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని, హుజురాబాద్ ప్రజలు ఓట్లు వేయకపోతే నా శవ యాత్ర చూస్తారని బెదిరించి, సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసి గెలిచి ఇప్పుడు హుజురాబాద్ ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి ఎమ్మెల్యే లని, స్పీకర్ ను ఎవ్వరిని లెక్కచేయకుండా ఒక సైకో లాగా వ్యవహరిస్తున్నాడని, గతంలో సైతం ఎమ్మెల్సీ గా ఉన్న సందర్భంలో ఎంతోమంది అమాయకులని ఇబ్బందులకు గురి చేశాడని, సొంత పార్టీ కార్యకర్తల పై కేసులు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయని, మీడియా వాళ్ళను సైతం ఇంట్లో బంధించి దాడులకు సైతం పాల్పడ్డాడని గుర్తుచేశారు. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే తెలంగాణ సమాజానికి చాలా ప్రమాదం అని అన్నారు. ప్రజలపట్ల,అధికారుల పట్ల, సహచర ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవరిస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.





