నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి (అనంతగిరి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్ తప్పొప్పలు దొర్లకుండా క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిది దీనిలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో నిర్వహిస్తున్న సూపర్ చెక్ కార్యక్రమాన్ని జెడ్పి సీఈవో అప్పారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ఎంపికను వేగవంతం చేసిందని ఇందులో భాగంగానే సూపర్ చెక్ ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి నష్టం జరగకుండా కార్యదర్శి ద్వారా నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుదారుల వివరాలు మాత్రమే యాప్లో నమోదయ్యాయా, దరఖాస్తు చేయని వారిని నమోదు చేశారా, దరఖాస్తుదారులు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు ఏ విధంగా ఉన్నాయి. ఎక్కడ ఉంటున్నారు. సొంతిల్లా, అద్దెకు ఉంటున్నారా అనే అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ చెక్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. సూపర్ చెక్ ద్వారా వాస్తవానికి విరుద్ధంగా యాప్లో నిక్షిప్తమై ఉంటే వాటిని తీసేస్తున్నారని అన్నారు. గ్రామ వార్డుల్లో సర్వే చేపట్టిన వాటిల్లో 5 శాతం ఇళ్ల వివరాలను ప్రభుత్వం మండలాల్లోని ఎంపీడీవో కు లాగిన్ పంపించిందనీ దాని ప్రకారం ప్రత్యేక సిబ్బంది సూపర్ చెక్ పేరుతో వివరాలు తీసుకుంటున్నామన్నారు. దీంతో అర్హులకు మాత్రమే ఇళ్లు లభించే అవకాశం ఉందనీ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షేక్ సుష్మా, మండల స్పెషల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.





