Thursday, March 12, 2026

జనవరి 19న మందకృష్ణ రాక

  • సిద్దిపేట సభను విజయవంతం చేయండి.
  • ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పర్శరాములు

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద గురువారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు వడ్లూరి పర్శరాములు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనవరి 19, 2025న మంద కృష్ణ మాదిగ గారు సిద్దిపేట జిల్లాలో నిర్వహించే సభను విజయవంతం చేయడం, అలాగే ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘వెయ్యి గొంతులు – లక్ష డప్పులు’ మహా ప్రదర్శన ర్యాలీకి మండలం నుండి అధిక సంఖ్యలో డప్పులు మరియు ప్రజలను సమీకరించేందుకు చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెజ్జంకి మండల మాజీ మాదిగ ప్రజాప్రతినిధులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, కర్రావుల మల్లేశం, మంకాల బాలయ్య, కొంకటి జెగన్, మండల ఇంచార్జ్ చింతకింది పర్శరాములు, గౌరవ సలహాదారులు తాడిచెట్టు భూమయ్య, ప్రధాన కార్యదర్శి మోదుంపల్లి రాజు, ఉపాధ్యక్షులు చింతకింది ఎల్లయ్య, బెజ్జంకి శంకర్, టౌన్ అధ్యక్షుడు బోనగిరి చంద్రం, అన్ని గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, దక్కలి సంఘం నాయకుడు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News