నేటి సాక్షి, మల్లాపూర్ :
పిల్లలు పుట్టడం లేదని ఏకాంత జీవితం గడపలేక కేరళ వాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళ రాష్ట్రంలోని ఆళ్ళపీ జిల్లా తగ్గాడి గ్రామానికి చెందిన రాజప్పన్ రాజేష్ (52) అను కేరళ వాసి మల్లాపూర్ మండల కేంద్రంలో నివాసం ఉంటూ మండలంలోని కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో ఉన్న ఓ ప్రయివేటు స్కూల్ లో టీచర్ గా పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి 12 సంవత్సరాల క్రితం అదే రాష్టానికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. కానీ వారికి సంతానం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో గత 5 సంవత్సరాల నుండి భార్య భర్తలు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. పిల్లలు పుట్టారని భార్య విడిచిపెట్టడంతో మనస్తాపం చెందిన రాజేష్ ఈనెల 14న సాయంత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్లి మల్లాపూర్ గ్రామ శివారులోని దుబ్బగట్టు ప్రాంతంలో ఉన్న ఒక్క చెట్టుకు ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు అనిల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.





