Thursday, March 12, 2026

రైతు రాజ్యం ఆచ్చేది ఎప్పుడు షార్ట్ ఫిలిం షూటింగ్

నేటి సాక్షి, బెజ్జంకి: మండలంలోని దేవక్కపల్లి పరిసర ప్రాంతంలో రైతు రాజ్యం ఆచ్చేది ఎప్పుడు అనే షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభించబడింది. ఈ చిత్రాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు సొల్లు అజయ్ వర్మ ప్రారంభించారు. ఈ షూటింగ్‌లో కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, డైరెక్టర్ అకేన భాస్కర్, హీరోయిన్ మౌన శ్రీ, కమలాకర్ రెడ్డి, సమరసింహారెడ్డి, తిరుపతి లక్ష్మి, పూసల సాయి తదితరులు నటిస్తున్నారు. సొల్లు అజయ్ వర్మ ఈ చిత్రంలో రైతు కష్టాలు తీర్చే నాయకునిగా,అలాగే కరివేద మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యారెక్టర్లో రైతుల పక్షాన నిలబడి పోరాడే నాయకుడిగా నటిస్తున్నారు. కమలాకర్ రెడ్డి దలారీ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రొడ్యూసర్ గా అజయ్ వర్మ మార్గదర్శకత్వంలో రెండు, మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రైతు కష్టాలను ప్రతిబింబించే చిత్రమై, రైతు రాజ్యం ఏర్పడినపుడు మాత్రమే రైతు కష్టాలు తగ్గుతాయని అజయ్ వర్మ తెలిపారు. అందరూ ఈ సినిమాను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News